రేపు సాఫ్ట్ బాల్ మహిళా జట్ల ఎంపిక

ప్రకాశం: ఒంగోలు సమీపంలోని ఏడుగుండ్లపాడులో ఉన్న శ్రీహర్షిణి ఇంజనీరింగ్ కాలేజీలో ఈనెల 24వ తేదీన 12వ సీనియర్స్ సాఫ్ట్ బాల్ మహిళ జట్టు ఎంపిక నిర్వహించనున్నట్లు ఏపీ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ప్రతినిధి రమేష్ బాబు తెలిపారు. ఈ మేరకు ఒరిజినల్ ఆధార్ కార్డు, రెండుపాస్ పోర్టు సైజ్ ఫొటోలతో హాజరు కావాలని వివరించారు.