యాషెస్: రెండో టెస్టు ముందు ఆసీస్‌కు షాక్
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా రెండో టెస్టు ఈనెల 4 నుంచి ప్రారంభం కానుంది. బ్రిస్బేన్‌లోని గాబా వేదికగా జరిగే ఈ టెస్టుకు ఆసీస్ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా దూరమయ్యే అవకాశం ఉంది. అతడు వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. ఒకవేళ ఖవాజా ఈ మ్యాచ్‌కు దూరమైతే ఆసీస్‌కు ఇది భారీ ఎదురుదెబ్బ కానుంది.