బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా న్యాయవాది కిరణ్

బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా న్యాయవాది కిరణ్

వనపర్తి బార్ అసోసియేషన్‌కు జరిగిన ఎన్నికల్లో నూతన అధ్యక్షులుగా కిరణ్ కుమార్ గెలుపొందారు. ప్రధాన కార్యదర్శి‌గా వెంకటరమణ గెలుపు పొందారని ఎన్నికల అధికారి సీనియర్ న్యాయవాది అయిత కృష్ణ మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం ఓట్లు 177 దాదాపు 85 శాతం పోలింగ్ జరిగిందని చెప్పారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.