రోడ్డు ప్రమాదాల నివారణకు 'స్టాప్, ఫేస్ వాష్ అండ్ గో'
కడప: SP నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు రాజంపేటలో రోడ్డు ప్రమాదాల నివారణకు నిన్న 'స్టాప్, ఫేస్ వాష్ అండ్ గో' కార్యక్రమం చేపట్టారు. పట్టణ SI పి.వెంకటేశ్ మాట్లాడుతూ.. అర్ధరాత్రి దాటాక లారీలు, బస్సులు, వ్యాన్లు, కార్లు వంటి వాహనాల డ్రైవర్లకు నీళ్లతో ముఖం కడిగించి, తమ కుటుంబసభ్యుల గురించి ఆలోచించి జాగ్రత్తగా నడపాలని సూచించినట్లు తెలిపారు.