గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ప్రారంభం
SRCL: పశువుల సంరక్షణకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సోమవారం జాతీయ పశు వ్యాధుల నివారణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పశువుల పెంపకందారులు ఆర్థిక నష్టాలను నివారించేందుకు ఉచిత టీకాలు వేయించుకోవాలని ఆమె తెలిపారు. పశు వైద్య, పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతోంది.