చెత్త సంపద కేంద్రం తనిఖీ

ప్రకాశం: పెద్ద చెర్లోపల్లి మండలం వేపగుంపల్లి చెత్త సంపద కేంద్రాన్ని డిప్యూటీ ఎంపీడీఓ ఎస్. రాంప్రసాద్ శనివారం పరిశీలించారు. ఇళ్ల నుంచి సేకరించే చెత్తను తడి, పొడి, ప్రమాదకర చెత్తగా వేరుచేసి చెత్త సంపద కేంద్రాలకు తరలించాలన్నారు. చెత్త నుంచి సంపదను తయారు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని పంచాయతీ సెక్రెటరీ ఆచారిని డిప్యూటీ ఎంపీడీఓ ఆదేశించారు.