జిల్లాలో క్రికెట్ బుకీలు అరెస్ట్

జిల్లాలో క్రికెట్ బుకీలు అరెస్ట్

PLD: నరసరావుపేట ఐలా బజార్‌లో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఆరుగురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెట్టింగ్ ముఠా సభ్యులు షేక్ ఖాసీం, షేక్ మస్తాన్ వలీ, షేక్ రఫీ జాన్, పసుపులేటి నాగరాజు, శిఖా చక్రవర్తి, పతేలా వెంకటేశ్వరరావు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.4.58 లక్షల నగదు, ల్యాప్ టాప్, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగ్‌లకు పాల్పడితే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.