ఇంటర్ పరీక్షలకు 'సెట్-సి' ప్రశ్నపత్రం
KNR: నేడు జరగనున్న ఇంటర్ ద్వితీయ సంవత్సర గణితం-ఏ, బాటనీ, పౌరశాస్త్రం పరీక్షలకు బోర్డు అధికారులు 'సెట్-సి' ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేశారు. జమ్మికుంటలోని 3 కేంద్రాల్లో మొత్తం 692 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. వీరిలో 441 మంది జనరల్, 251 మంది వొకేషనల్ విద్యార్థులు ఉన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.