VIDEO: రైతుల కోసం కూటమి ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే
ATP: రైతన్నల కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. సోమవారం గుత్తి మండలం రజాపురం గ్రామంలో 'రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ కూటమి ప్రభుత్వం రైతన్నలకు చేసిన మంచిని వివరిస్తూ ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేశారు.