కనకమహాలక్ష్మి మృతి కేసులో సంచలన విషయాలు
VSP: పెందుర్తిలో వృద్ధురాలు కనకమహాలక్ష్మి(66) మృతి కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఆమె కోడలు లలిత దొంగ, పోలీసు ఆట ఆడుదామని అత్తను నమ్మించి.. కుర్చీలో కూర్చోపెట్టి కాళ్లు, చేతులు, కళ్లకు గంతలు కట్టింది. పెట్రోల్ పోసి, దేవుడి గదిలోని దీపంతో అత్తకు నిప్పంటించింది. అయితే, అగ్ని ప్రమాదం వల్ల చనిపోయిందని భావించిన పోలీసులు కోడలను విచారించగా ఈ దారుణానికి పాల్పడినట్లు అంగీకరించింది.