మాజీ ఛైర్‌పర్సన్‌‌ను పరామర్శించిన మాజీ సీఎం

మాజీ ఛైర్‌పర్సన్‌‌ను పరామర్శించిన మాజీ సీఎం

NTR: జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్‌పర్సన్‌, వైసీపీ మహిళా నేత తిప్పరమల్లి జమలపూర్ణమ్మ ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేయించుకున్నారు. ఈ మేరకు విజయవాడ కేదారేశ్వరపేటలోని ఆమె నివాసంకు వెళ్లి మాజీ సీఎం జగన్  పరామర్శించారు. ఆరోగ్య వరిస్ధితి వాకబు చేసి, ధైర్యాన్ని చెప్పారు. పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని తెలిపారు.