ALERT: 11AM తర్వాత బయటకు రావొద్దు
TG: రాష్ట్రంలో ఐదురోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అయితే రానున్న 6 రోజులు మరింత అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్న నేపథ్యంలో మధ్యాహ్నం బయటకు రావొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు వేడిగాలులు వీచే అవకాశాలున్నాయని చెప్పారు. మరోవైపు అధిక ఉష్ణోగ్రతల కారణంగా క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి ఆకస్మిక వర్షాలు కురిసే అవకాశం ఉంది.