వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి

KNR: తిమ్మాపూర్ మండలం లోయర్ మానేరు డ్యాంలో చేపల వేట కోసం వెళ్లి మానకొండూరు మండలం ముంజంపల్లి గ్రామానికి చెందిన పిల్లి కనుకయ్య(58) అనే మత్స్యకారుడు మృతి చెందాడు. నిన్న శనివారం సాయంత్రం ఎల్‌ఎండీ లో చేపలు పట్టేందుకు వలలు వేసేందుకు తేప్ప సహాయంతో డ్యాం లోపలికి వెళ్లి వలలు వేసే క్రమంలో ప్రమాదవశాత్తు వాళ్లకు చిక్కుకొని నీటిలో పడి మృతి చెందాడు.