VIDEO: రెండు మున్సిపాలిటీల జనాభా వివరాలు విడుదల

VIDEO: రెండు మున్సిపాలిటీల జనాభా వివరాలు విడుదల

వరంగల్ జిల్లాలోని నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీలకు సంబంధించిన వార్డు, జనాభా వివరాలను అధికారులు వెల్లడించారు. 2011 జనగణన ప్రకారం నర్సంపేటలో 30 వార్డులు, జనాభా 51,086 కాగా, ఎస్సీ 7,110, ఎస్టీ 4,397 మంది ఉన్నారు. వర్ధన్నపేటలో 12 వార్డులు, జనాభా 13,732 కాగా, ఎస్సీ 2,470, ఎస్టీ 3,980 మంది ఉన్నారు. మంగళవారం నుంచి వార్డుల వారిగా క్రమబద్ధీకరిస్తారు.