వాగు మల్లారంలో మంచినీటికి శాశ్వత పరిష్కారం
BDK: మణుగూరు మండలం సమితి సింగారం గ్రామపంచాయతీలో సర్పంచ్ మాధవరావు మంచినీటి బోర్లను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. వాగు మల్లారం ప్రాంతంలో నీటి ఎద్దడిని ముందుగానే ఊహించి ప్రజల సౌకర్యార్థం నూతన బోర్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. దీంతో ఈ గ్రామంలో మంచినీటికి శాశ్వత పరిష్కారం లభించిందన్నారు.