రేషన్ అందక లబ్ధిదారులు ఆందోళన

కడప: సిద్దవటం మండలంలోని మాధవరం -1పంచాయతీ SKR గ్రామంలోని రేషన్ కార్డుల బ్ధిదారులు మంగళవారం గ్రామ సచివాలయం-2 వద్ద రేషన్ బియ్యం అందలేదని ఆందోళన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ.. గ్రామంలోని షాపు నెంబర్ 15 నందు గత రెండు నెలలుగా రేషన్ అందక తీవ్ర అవస్థలు పడుతున్నామన్నారు. సంబంధిత అధికారులు సమస్యలు పరిష్కరించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.