ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య
MDK: కౌడిపల్లి మండల కేంద్రానికి చెందిన చంద్రం ప్రవీణ్ కుమార్ గౌడ్ (35) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రైవేట్ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్న ప్రవీణ్ కుమార్ గౌడ్ కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.