ఈ నెల 16 నుంచి వేంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ

ప్రకాశం: చంద్రశేఖరపురం మండలంలోని బాలుపల్లిలో ఈ నెల 16 నుంచి 18 వరకు వేంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు దేవస్థాన నిర్వాహకులు తెలిపారు. ఈ మూడు రోజులు స్వామివారికి పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. కావున భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు.