జీవీఎంసీ గేటు వద్ద కార్పొరేటర్ల నిరసన
VSP: జీవీఎంసీ ప్రధాన ద్వారం వద్ద సీపీఎంకు చెందిన కార్పొరేటర్లు శనివారం నిరసన వ్యక్తం చేస్తూ రోడ్డు మీద బైఠాయించారు. కార్పొరేటర్లు గంగారావు, స్టాలిన్ గీతం భూములపై నిరసన ప్రారంభించారు. జీవీఎంసీ కౌన్సిల్‌ను ఎంపీకి తాకట్టు పెట్టారని విమర్శించారు. కార్పొరేటర్లపై దాడి చేసి గీతంలో ప్రభుత్వ భూములను బదలాయించారని నినాదాలు చేశారు.