ముమ్మరంగా శుభ్రత కార్యక్రమాలు
కృష్ణా: గుడ్లవల్లేరులో ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పంచాయతీ అధికారులు శుభ్రత కార్యక్రమాలను శనివారం చేపట్టారు. కాలువలు, డ్రైనేజీలు, రోడ్డు పక్క ప్రాంతాలను శుభ్రపరిచి, బ్లీచింగ్ పౌడర్ చల్లామని శానిటరీ ఇన్‌స్పెక్టర్ పవన్ కుమార్ తెలిపారు. ప్రజలు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా చెత్త బండి వారికి అందజేయాలని ఆయన సూచించారు.