జిల్లాలో హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ

PPM: SC అభ్యర్థులకు APSRTC డ్రైవింగ్ స్కూల్‌లో హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార సంస్థ ఛైర్మన్, కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ గురువారం తెలిపారు. ఐదుగురు పురుషులు, ఐదుగురు మహిళలకు మాత్రమే శిక్షణ ఇస్తామన్నారు. శిక్షణకు అయ్యే ఖర్చు పూర్తిగా ఎస్సీ కార్పొరేషన్ భరిస్తుందని పేర్కొన్నారు.