'ప్రతి చిన్నారికి టీకాలు వేయాలి'

NGKL: ప్రాణాంతకవ్యాధులు సోకకుండా ప్రతిచిన్నారికి సంపూర్ణ టీకాకరణే లక్ష్యంగా సిబ్బంది పనిచేయాలని జిల్లా ఆరోగ్యశాఖ అధికారి రవికుమార్ సూచించారు. పాలెం PHC, బిజినేపల్లి, మంగనూరు ఆరోగ్య ఉపకేంద్రాలను శనివారం ఆయన తనిఖీచేశారు. వ్యాక్సిన్ నిలువలు, శీతలీకర స్థితిని, టీకాకరణ ప్రక్రియను ఆయన పరిశీలించారు. టీకాలు తీసుకోవడానికి వచ్చిన చిన్నారుల తల్లులకు అవగాహన కల్పించారు.