పనులు నాసిరకం.. సీసీ రోడ్డుకు నేర్రెలు..!

పనులు నాసిరకం.. సీసీ రోడ్డుకు నేర్రెలు..!

SDPT: చిన్నకోడూరు మండలం రామునిపట్లలోని డబుల్ బెడ్ రూం ఇండ్ల వెనక నుంచి గ్రామంలోకి వెళ్లే రోడ్డులో ఇటీవల సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. సీసీ రోడ్డు నిర్మాణం చేసి వారం రోజులు గడవకముందే నేర్రెలు (పగుళ్లు) వచ్చాయని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. సీసీ రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని వారు వాపోతున్నారు.