బాలుడు అదృశ్యం.. కేసు నమోదు

బాలుడు అదృశ్యం.. కేసు నమోదు

PLD: పెదకూరపాడు మండల పరిధిలోని లగడపాడు గ్రామానికి చెందిన బాలుడు కె. సంతోష్ కుమార్ (13) తప్పిపోయాడు. తండ్రి కొమరబత్తిన సుధాకర్ స్కూలుకి వెళ్లకుండా మధ్యలో ఇంటికి వస్తున్నావు ఏందని మందలించటంతో స్కూల్‌కి వెళ్తున్నానని చెప్పి తిరిగి ఇంటికి రాలేదని  పెదకూరపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్సై మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.