పొందూరులో ఉచిత మెగా వైద్య శిబిరం

SKLM: పొందూరు మండలం తోలాపి గ్రామంలో ఆదివారం సత్య సాయి బాబా మందిరంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా పలువురు రోగులకు వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందించారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవ సమితి కన్వీనర్ జగన్మోహన్ రావు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.