పొలాల్లోకి దూసుకుళ్లిన ఆర్టీసీ బస్సు

పొలాల్లోకి దూసుకుళ్లిన ఆర్టీసీ బస్సు

KMR: RTC బస్సు బేరింగ్ ఫెయిల్ అయి పొలాల్లోకి దూసుకెళ్లిన ఘటన నేడు చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. బాన్సువాడ డిపో నుంచి KMR డిపోకు వస్తున్న బస్సు KMR జిల్లా గాంధారి మండలం సితాయిపల్లి గ్రామ శివారులోకి రాగానే బస్సు బేరింగ్ ఫెయిల్ అయి పొలాల్లోకి దూసుకుపోయింది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై అధికారులు ఆరా తీస్తున్నారు.