డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే బస్సు బోల్తా: CI
NZB: డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ట్రావెల్ బస్సు బోల్తా పడిందని డిచ్పల్లి సీఐ వినోద్ పేర్కొన్నారు. ఇందల్వాయి మండలం గన్నారం వద్ద శుక్రవారం తెల్లవారుజామున బస్సు బోల్తా ఘటనపై మీడియాతో ఆయన వివరాలు వెల్లడించారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణం వల్లే బండ రాయిని ఢీకొని బస్సు బోల్తా పడిందని అన్నారు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, మిగతావారు చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.