VIDEO: భారత్ గ్యాస్ గోదాంలో 300 సిలిండర్ల మాయం
NGKL: అచ్చంపేట పట్టణంలో సోమవారం భారత్ గ్యాస్ గోదాంలో తహశీల్దార్ సైదులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు 300 గ్యాస్ సిలిండర్లు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వీటిని బ్లాక్ మార్కెట్‌కు తరలించినట్లు నిర్ధారించారు. ఈ అక్రమాలపై జిల్లా కలెక్టర్‌కు నివేదిస్తామని, బాధ్యులపై కేసు నమోదు చేస్తామని తహశీల్దార్ హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ఆర్ఐ శివ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.