ప్రజావాణిలో ఎస్పీకి 16 ఫిర్యాదులు

ప్రజావాణిలో ఎస్పీకి 16 ఫిర్యాదులు

GDWL: గద్వాల జిల్లాలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌డే కార్యక్రమంలో ఎస్పీ శ్రీనివాసరావు నేరుగా 16 ఫిర్యాదులను స్వీకరించారు. వీటిలో పొలానికి సంబంధించినవి 7, గొడవలకు 2, భర్త వేధింపులకు 2, ప్లాట్ ఇష్యూ, దొంగతనానికి సంబంధించినవి ఒక్కొక్కటి ఉన్నాయని తెలిపారు. బాధితుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఎస్పీ సంబంధిత అధికారులను ఆదేశించారు.