108 వాహనాల పనితీరును పరిశీలించిన జిల్లా వైద్యాధికారి

108 వాహనాల పనితీరును పరిశీలించిన జిల్లా వైద్యాధికారి

PDPL: కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ అన్నప్రసన్న కుమారి శనివారం 108 వాహనాలను తనిఖీ చేశారు. వాహనాల పనితీరు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన ఆమె, అత్యవసర వేళల్లో ఆపదలో ఉన్న వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించడంలో 108 వాహనాల ప్రాముఖ్యతను తెలిపారు. ప్రత్యేక పరిస్థితుల్లో 108 సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.