నేడు బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నేడు బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

TG: బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇవాళ హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వేడుకలు నిర్వహించనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు జెండా ఆవిష్కరిస్తారు. కార్యకర్తలు తమ ఇళ్లపై బీజేపీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఏప్రిల్ 6, 1980న వాజ్‌పేయి, లాల్ కృష్ణ అద్వానీ ఆధ్వర్యంలో ఏర్పాటై.. ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ శక్తిగా ఎదిగింది.