ఫైర్ స్టేషన్ ఏర్పాటు కోసం కలెక్టర్‌కు వినతి
మార్కాపురం జిల్లా పొదిలి కేంద్రంగా అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలని లోక్ సత్తా పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ కోరారు. ఈ మేరకు ఆయన గురువారం కలెక్టర్ విజయ సునీతకు వినతి పత్రం అందించారు. పొదిలి మండలం మూగచింతల, కంబాలపాడు గ్రామాల్లో ఇటీవల పొగాకు బ్యారెన్లు తగలబడిన విషయాన్ని ప్రస్తావించినట్లు వెల్లడించారు.