డిక్టేషన్ రాయలేదని విద్యార్థిపై ప్రిన్సిపాల్ ప్రతాపం..!
SRPT: పదాలు సరిగా రాయలేదన్న నెపంతో ఓ విద్యార్థిపై ప్రిన్సిపాల్ ప్రతాపం చూపారు. నూతనకల్‌లోని నాగార్జున హైస్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న బాదావత్ సిద్ధు అనే విద్యార్థిని ప్రిన్సిపాల్ మార్గాని వెంకట్ గౌడ్ విచక్షణారహితంగా కొట్టారు. విద్యార్థి ఒంటిపై గాయాలు చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.