టర్కీకి మరో ఎదురుదెబ్బ

పాకిస్తాన్‌కు సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో టర్కీని 'బాయ్‌కాట్' చేయాలని పలువురు పిలుపునిస్తున్నారు. ఈ క్రమంలోనే టర్కీ యూనివర్సిటీతో చేసుకున్న ఒప్పందాన్ని జేఎన్‌యూ నిలిపేసింది. దేశ భద్రత అంశాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ మేరకు నిర్ణయించినట్లు వెల్లడించింది. కాగా, టర్కీలోని ఇనొను యూనివర్సిటీతో గతంలో కుదుర్చుకున్న ఎంవోయూను జేఎన్‌యూ నిలిపివేసింది.