భారీ అగ్నిప్రమాదం.. కాలిపోయిన పంట

భారీ అగ్నిప్రమాదం.. కాలిపోయిన పంట

TG: వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మొగిలిచెర్లకు వెళ్లే రహదారిపై రైతులు మొక్కజొన్న కంకులను ఆరబెట్టారు. అయితే, రాత్రి ఓ రైతు చేనులో మొక్కజొన్న చొప్పను కాల్చేందుకు నిప్పుపెట్టగా ప్రమాదవశాత్తు అది చేలకు అంటుకుని మంటలు భారీగా ఎగసిపడ్డాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.