శిష్టకరణ విభాగ అధ్యక్షుడిగా మానాపురం
VSP: వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మానాపురం శ్రీనివాస్ పట్నాయక్‌ను విశాఖపట్నం జిల్లా శిష్టకరణ విభాగ అధ్యక్షుడిగా నియమించారు. ఈ సందర్భంగా సహకరించిన పార్టీ నాయకులకు శుక్రవారం ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన బాధ్యతను సంపూర్ణ నిబద్ధతతో నిర్వహిస్తానని చెప్పారు.