అవి పెద్దపులి ముద్రలు కావు.. హైనావి: ఫారెస్ట్ అధికారులు
JGL: కథలాపూర్ మండలం కలికోట గ్రామంలో ఆదివారం రాత్రి పెద్దపులి సంచరించినట్లు పుకార్లు రావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. అయితే సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు సోమవారం రంగంలోకి దిగారు. పెద్దపులి పాద ముద్రలుగా ఉన్న వాటిని పరిశీలించి అవి పెద్దపులి ముద్రలు కావని, అది హైనా పాద ముద్రలని నిర్దారించారు. దీంతో గ్రామస్తులు ఊపరీ పీల్చుకున్నారు.