గొర్రె పందేలు ఆడుతున్న ఐదుగురు అరెస్ట్
PPM: జియ్యమ్మవలస మండలం సింగనాపురం గ్రామ సమీపంలో గొర్రెపోతు పందేలు ఆడుతున్న 5గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని ఎస్సై అనిష్ బుధవారం తెలిపారు. పందేలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో స్పెషల్ బ్రాంచ్, సివిల్ పోలీసులు రైడ్స్ చేపట్టామని వారి వద్ద నుండి రెండు గొర్రెపోతులు, 1025 రూపాయలు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామన్నారు.