ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేయాలి : కలెక్టర్
సూర్యాపేట పట్టణంలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలికల డిగ్రీ కళాశాలను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ బుధవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు.హాస్టల్ డైనింగ్ హాల్, కిచెన్, లైబ్రరీలను పరిశీలించి, భోజనం నాణ్యతపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సమస్యల కోసం వెంటనే ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేయాలని ప్రిన్సిపల్‌ను ఆదేశించారు.