సబ్‌స్టేషన్ స్థలాలను పరిశీలించిన డైరెక్టర్
సిరిసిల్ల జిల్లా సుభాష్ నగర్, వేములవాడ, చందుర్తి మండలాలలో నూతన సబ్ స్టేషన్ స్థలాలను NPDCL డైరెక్టర్ మోహన్ రావు సోమవారం పరిశీలించారు. సిరిసిల్ల ప్రాంతంలో పెరుగుతున్న విద్యుత్ లోడును దృష్టిలో ఉంచుకుని వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందిస్తామన్నారు. నూతన సబ్‌స్టేషన్‌లు ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా ఉంటుందన్నారు.