పెట్రోల్ అక్రమ రవాణా అరికట్టాలి: MLC
కోనసీమ: కేంద్రపాలిత ప్రాంతం యానం నుంచి జరుగుతున్న పెట్రోల్ అక్రమ రవాణాను వెంటనే అరికట్టాలని MLC కుడిపూడి సూర్యనారాయణరావు డిమాండ్ చేశారు. శుక్రవారం అమలాపురం కలెక్టరేట్లో అధికారులకు ఫిర్యాదు చేశారు. అనంతరం అయన మాట్లాడుతూ.. ఆయిల్ కంపెనీల పరిమితులను రద్దు చేయాలని కోరుతూ త్వరలోనే కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రికి ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన వివరించారు.