విద్యార్థులకు ఉచిత కంటి అద్దాలు పంపిణీ
SRD: సిర్గాపూర్ హైస్కూల్‌లో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. దృష్టి లోపం ఉన్నవారికి ఉచిత కంటి అద్దాలను స్థానిక సర్పంచ్ శ్రీనివాసరావు, ఎంఈవో నాగారం శ్రీనివాస్ పంపిణీ చేశారు. పౌష్టికాహారం ప్రతినిత్యం సకాలంలో తీసుకుంటే దృష్టిలోపం రాదని, ఈ విషయంలో తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల శ్రద్ధ వహించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో టీచర్లు నిహారిక, సంతోషకుమార్ పాల్గొన్నారు.