ఇందిరమ్మ ఇళ్లు ఒకరిది – బిల్లు మరొకరికి!
WGL: నల్లబెల్లి (M) రేలకుంట గ్రామానికి చెందిన బల్ల సుమలతకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, బేస్మెంట్ లెవెల్ వరకు ఇల్లు పూర్తి చేయక అధికారులు వచ్చి ఫోటో తీసుకొని రూ.1లక్ష బిల్లు వస్తుందని తెలిపారు. అలస్యం అవుతుందని అధికారులను సంప్రదించగా ఇదే గ్రామానికి చెందిన వేరొకరి పేరు మీద బిల్లు మంజూరు ఆయినట్లు తెలిపారు. ఈ సమస్యపై ఉన్నత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయలని సుమలత కోరారు.