VIDEO: లీజర్ ఆసుపత్రి ద్వారా చేస్తున్న సేవలు అభినందనీయం
కోనసీమ: అంబాజీపేట లీజర్ మెమోరియల్ ఆసుపత్రి ద్వారా పేద ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలు అభినందనీయమని పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. అంబాజీపేటలో లీజర్ మెమోరియల్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఇవాళ నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.