రేపు చిన్నచింతకుంటకు మంత్రి రాక

MBNR: భూ భారతి చట్టంపై ఈనెల 30న చిన్నచింతకుంట కురుమూర్తి దేవస్థాన ప్రాంగణంలో నిర్వహించే అవగాహన సదస్సుకు రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు రానున్నట్లు మంగళవారం అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ తెలిపారు. సదస్సులో అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు.