'రేపు విద్యాసంస్థల బందు విజయవంతం చేయండి'

నిజామాబాద్: నీట్ పరీక్ష పత్రాల లీకేజీకి నిరసనగా రేపు దేశ వ్యాప్తంగా విద్యాసంస్థల బంధు నిర్వహిస్తున్నట్లు NSUI జిల్లా అధ్యక్షుడు సందీప్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. నీట్ పరీక్షల పత్రాలు లీక్ చేసి లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం ఆటలాడుతుందని, దీనిపై ఇప్పటివరకు ప్రధాని స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. దానికి నిరసనగా విద్యాసంస్థలను మూసివేయాలన్నారు.