క్యాంప్ కార్యాలయంపై దాడి దారుణం
BHPL: గజ్వేల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఘటన రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి స్పందిస్తూ, కాంగ్రెస్ శ్రేణులు అకస్మాత్తుగా క్యాంప్ ఆఫీసులోకి దూసుకెళ్లి ఉద్రిక్తత సృష్టించారని ఆరోపించారు. ఇలాంటి చర్యలు చేయడం దారుణమని మండిపడ్డారు.