హనీ ట్రాప్ కేసు.. సీఐలపై వేటు
ATP: జిల్లాలో హనీ ట్రాప్ కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే, ఈ కేసుకు సంబంధించి సీఐలు రాజేంద్ర నాథ్, శ్రీ హర్షపై వేటు పడింది. ఎస్పీ ఆదేశాల మేరకు వారిని కర్నూలు వీఆర్‌కు బదిలీ చేశారు. ఇంకా ఎవరైనా పోలీసు అధికారులకు కేసుతో ప్రమేయం ఉందా అనే కోణంలో ఎస్పీ ఆరా తీస్తున్నారు. ట్రాప్‌కు సంబంధించి పలువురు మహిళలను కూడా అరెస్ట్ చేసినట్లు సమాచారం.