నెల్లిపర్తి సర్పంచ్ చెక్ పవర్ రద్దు
SKLM: ఆమదాలవలస మండలం నెల్లిపర్తి గ్రామపంచాయతీ సర్పంచ్ ఎం.రాజేశ్వరి చెక్ పవర్‌ను జిల్లా పంచాయతీ అధికారి కె.భారతి సౌజన్య రద్దు చేశారు. పంచాయతీ సాధారణ 15వ ఆర్థిక సంఘం నిధుల దుర్వినియోగం పై పలువురు గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో అధికారులు విచారణ నిర్వహించారు. విచారణలో అభియోగాలు నిజమని తేలడంతో, చెక్ పవర్‌ను 6 నెలల పాటు రద్దు చేసినట్లు MPDO సోమవారం తెలిపారు.