IPL: చరిత్ర సృష్టించిన ధోనీ

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ చరిత్రలో ఒక అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యధికంగా 100 మ్యాచ్‌ల్లో నాటౌట్‌గా నిలిచిన ఏకైక ఆటగాడిగా ధోనీ నిలిచాడు. నిన్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ నాటౌట్‌గా నిలవడం ద్వారా ఈ ఘనతను సాధించాడు.